హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి చంపి, ప్రియుడి ఆత్మహత్య

30-07-2021 Fri 07:32 | Telangana
  • యువతీయువకులు ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే
  • ప్రేయసి గొంతును బ్లేడుతో కోసి ఆపై ఉరేసుకున్న ప్రియుడు
  • క్షణికావేశంలోనే ఘటన జరిగి ఉంటుందన్న పోలీసులు
హైదరాబాద్, మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తన ప్రేయసిని చంపి, ఆపై తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. యువతిని వికారాబాద్ జిల్లా బొంరాసుపేట మండలం లగచర్లకు చెందిన సంతోషి (25)గా గుర్తించారు. యువకుడిని నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని హకీంపేటకు చెందిన జి.రాములు (25)గా గుర్తించారు. హోటల్ సిబ్బంది సమాచారంతో హోటల్‌కు చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. సంతోషి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా, రాములు రెండు కార్లు కొనుక్కుని హైదరాబాద్‌లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములుకు సంతోషితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బుధవారం వీరిద్దరూ నగరానికి వచ్చి లెమన్‌ట్రీ హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న 317 నంబరు గదిలో దిగారు.

నిజానికి వీరు గురువారం మధ్యాహ్నం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా, మరో రోజుకు పొడిగించారు. అయితే, గురువారం సాయంత్రం వారి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న రూమ్ ‌బాయ్ లోపలి నుంచి వస్తున్న అరుపులు విని సిబ్బందికి చెప్పాడు. ఆ తర్వాత చాలా సేపటి వరకు రూము నుంచి ఎలాంటి మాటలు వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మారుతాళంతో  గది తలుపులు తెరిచి చూశారు. బాత్రూములో సంతోషి మృతదేహం కనిపించగా, రాములు మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

బాత్రూములో సంతోషి మృతదేహం నగ్నంగా పడి ఉంది. రాములు ఆమె మెడను బ్లేడుతో కోసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె చున్నీతో రూములోని ఫ్యాన్‌కు రాములు ఉరివేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతకుముందు వీరిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, విచక్షణ కోల్పోయి రాములు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.

హత్యకు ఉపయోగించిన బ్లేడ్‌, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు, ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి. నిజానికి వీరిద్దరూ గతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, పెద్దలు అంగీకరించకపోవడంతో విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
HyderabadLemontree HotelSuicideMahbubnagar District

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more