వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ఇక్కడ లేఖలు.. అక్కడ సహకారం: ఏపీ ప్రభుత్వంపై కనకమేడల ఆగ్రహం
- విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తుతాం
- కేంద్రానికి లేఖలు రాసినట్టే రాసి లోపాయికారీ ఒప్పందం
- రాజీనామాలు చేసి పోరాడేందుకు మేం సిద్ధం
- వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, కలిసి రావాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన ప్రభుత్వం కేంద్రానికి మాత్రం లోపాయికారీగా సహకరిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ సహకారం లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసాధ్యమని కనకమేడల స్పష్టం చేశారు.