చత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోల మృతి
- దోల్కాల్-పెదపాల్ అటవీ ప్రాంతంలో ఘటన
- బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టుల హతం
- మూడు తుపాకులు, మూడు కిలోల ఐడీఈ బాంబులు స్వాధీనం
చనిపోయిన వారిని మిలటరీ ప్లాటూన్ కమాండర్ బిర్జు కాకెమ్ (35), ఆర్‌పీసీ ఉపాధ్యక్షుడు జగ్గూ కాకెమ్ (30), మిలీషియా ప్లాటూన్ సభ్యుడు అజయ్ ఒయామీ (26)గా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మూడు స్వదేశీ తుపాకులు, 3 కిలోల ఐఈడీ బాంబులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.