సీఎం జగన్ తెలుగు అకాడమీ చరిత్ర తెలుసుకోవాలి: మండలి బుద్ధప్రసాద్
- తెలుగు అకాడెమీ పేరుమార్చిన ఏపీ సర్కారు
- తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్పు
- ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
- విచారకరమన్న మండలి బుద్ధప్రసాద్
సీఎం జగన్ తెలుగు అకాడెమీ చరిత్ర తెలుసుకోవాలని మండలి బుద్ధప్రసాద్ హితవు పలికారు. మాతృభాషను గౌరవించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అని, తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని స్పష్టం చేశారు. కావాలనుకుంటే సంస్కృతానికి ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.