తెలంగాణ బిడ్డ కిష‌న్ రెడ్డి ఎదుగుద‌ల ప‌ట్ల రాష్ట్రం గ‌ర్వ‌ప‌డుతోంది: త‌మిళిసై
Add ap7am to your home Screen

తెలంగాణ బిడ్డ కిష‌న్ రెడ్డి ఎదుగుద‌ల ప‌ట్ల రాష్ట్రం గ‌ర్వ‌ప‌డుతోంది: త‌మిళిసై

tamilisai praises kishan reddy
  • కేంద్ర కేబినెట్ మంత్రిగా ప‌దోన్న‌తి పొందారు
  • జి.కిష‌న్ రెడ్డి గారికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు
  • మంత్రిగా కిష‌న్ రెడ్డి మ‌రిన్ని విజ‌యాలు సాధించాలి   
నిన్న జ‌రిగిన కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌లో బీజేపీ తెలంగాణ‌ నేత జి. కిషన్‌రెడ్డి మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ‌ల‌ను కేటాయించారు. కాసేప‌ట్లో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. దీనిపై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ స్పందించారు.

కేంద్ర కేబినెట్ మంత్రిగా ప‌దోన్న‌తి పొందిన జి. కిష‌న్ రెడ్డి గారికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని ఆమె ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి తెలంగాణ బిడ్డ కిష‌న్ రెడ్డి ఎదుగుద‌ల ప‌ట్ల రాష్ట్రం గ‌ర్వ‌ప‌డుతోంద‌ని ఆమె చెప్పారు. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ‌ల మంత్రిగా కిష‌న్ రెడ్డి దేశంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆమె ఆకాంక్షించారు.

Kishan Reddy
Tamilisai Soundararajan
Telangana

More Telugu News