తెలంగాణ కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

Telangana corona daily cases update
  • గత 24 గంటల్లో 1,05,186 కరోనా టెస్టులు
  • కొత్తగా 784 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 89 కేసులు
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,05,186 కరోనా పరీక్షలు నిర్వహించగా, 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు వెల్లడి కాగా, నల్గొండ జిల్లాలో 71 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 1,028 మంది కొవిడ్ బారి నుంచి కోలుకోగా, 5 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,703 మంది కరోనాతో కన్నుమూశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,28,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,13,124 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,455 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Deaths
Bulletin
Update

More Telugu News