తెలంగాణ కూడా కేఆర్ఎంబీ ఎదుటకు వచ్చి వాదనలు వినిపిస్తే బాగుంటుంది: సజ్జల

06-07-2021 Tue 19:23 | Both States
  • జల వివాదాలపై సజ్జల స్పందన
  • తాము కేఆర్ఎంబీలో వాదనలు వినిపిస్తున్నామని వెల్లడి
  • కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఎందుకన్న సజ్జల
  • ఢిల్లీ వెళ్లి సాధించేదేమీ లేదని వ్యాఖ్యలు
  • న్యాయం తమవైపే ఉందని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణతో జలవివాదాలపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎదుటకు వచ్చి వాదనలు వినిపిస్తే బాగుంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. తద్వారా కేఆర్ఎంబీ సమక్షంలోనే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. తాము కేఆర్ఎంబీ ఎదుటకు వచ్చి వాదనలు వినిపిస్తున్నప్పుడు కేసీఆర్ కు ఏమైందని ప్రశ్నించారు.

కేఆర్ఎంబీ సమావేశానికి రానని కేసీఆర్ అంటున్నారని, ఈ సమావేశానికి రాకుండా ఆయన ఢిల్లీ వెళ్లినందువల్ల ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా న్యాయం తమవైపే ఉందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేఆర్ఎంబీ పైనా విమర్శలు చేశారు. కేఆర్ఎంబీ పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు.

అసలు ఈ నీటి కేటాయింపుల సమస్యలన్నీ చంద్రబాబు వల్లే వచ్చాయని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు అప్పుడే తెలంగాణ ప్రాజెక్టులపై నిలదీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna ReddyKCRKRMBDelhiProjects

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more