ఏపీకి వర్ష సూచన... మూడు రోజుల పాటు వానలు
- కోస్తా జిల్లాల్లో వర్షాలు
- ఇవాళ, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వానలు
- రాయలసీమలో తేలికపాటి వర్షాలు
- ఎల్లుండి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు!
విశాఖ జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక
విశాఖ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగుల హెచ్చరిక జారీ చేసింది. జిల్లాలోని పాడేరు, చీడికాడ, దేవరాపల్లి, హుకుంపేట, అనంతగిరి, ఎల్.కోట, వేపాడ ప్రాంతాల్లో కాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. వ్యవసాయ క్షేత్రాల్లోని రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.