'డిక్టేటర్' దర్శకుడితో బాలయ్య సినిమా ఖరారే!
- 'అఖండ' దసరాకి వచ్చే ఛాన్స్
- గోపీచంద్ మలినేనితో పట్టాలపైకి
- శ్రీవాస్ డైరెక్షన్లో మరోసారి
- లైన్లో వినాయక్ కూడా
ఈ నేపథ్యంలో శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'లక్ష్యం' .. 'లౌక్యం' వంటి సూపర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్, ఆ మధ్య బాలయ్యతో 'డిక్టేటర్' చేశాడు. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఓకే అయిందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను, సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మించనున్నారని చెబుతున్నారు. ఇక శ్రీవాస్ సినిమా తరువాత అనిల్ రావిపూడి .. వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు ఉండనున్నట్టు తెలుస్తోంది.