తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు
Add ap7am to your home Screen

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు

Heavy rains in telangana today and tomorrow
  • నిన్న రాష్ట్రంలోని 317 ప్రాంతాల్లో వర్షాలు
  • అత్యధికంగా ఉప్పరిగూడెంలో 10.5 సెంటీమీటర్ల వర్షం
  • గత రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌లో వర్షం
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత రాత్రి నుంచి ఈ తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. కాగా, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 317 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

మహబూబాబాద్ జిల్లా ఉప్పరిగూడెంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురవగా,  పెద్దపల్లి జిల్లాలోని మల్యాలపల్లిలో 7, రామగుండంలో 6.9, మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌లో 5.9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.
Telangana
Hyderabad
Rains

More Telugu News