రాష్ట్రాల బోర్డు పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ... ఏపీ నిర్ణయం పట్ల ధర్మాసనం అభినందనలు
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలపై అనిశ్చితి
- తీవ్రంగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు
- పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు
- ముందే రద్దు చేస్తే బాగుండేదన్న జస్టిస్ ఖన్విల్కర్
విచారణ తర్వాత సీఎం వెంటనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. సవ్యరీతిలో నిర్ణయం తీసుకున్నారంటూ ధర్మాసనం ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల అంశం మానవీయతకు సంబంధించిన విషయం అని ధర్మాసనం పేర్కొంది. జులై 31 లోగా అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షల ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.