‘మా’ ఎన్నికలకు తన టీమ్​ ను ప్రకటించిన ప్రకాశ్​ రాజ్​
Add ap7am to your home Screen

‘మా’ ఎన్నికలకు తన టీమ్​ ను ప్రకటించిన ప్రకాశ్​ రాజ్​

Prakash Raj Announces His Panel For MAA Presidential Elections
  • 27 మందితో జాబితా విడుదల
  • టీంలో జయసుధ, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు
  • నటీనటుల బాగు కోసం పనిచేస్తానన్న ప్రకాశ్ రాజ్
‘మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. 27 మందితో జాబితాను విడుదల చేశారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మొదటి వ్యక్తి మంచు విష్ణు. ఆ తర్వాత తానూ పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ వెంటనే జీవితా రాజశేఖర్, నటి హేమలూ బరిలోకి దిగుతున్నామన్నారు.

ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరు కాస్తా.. చతుర్ముఖ పోరుగా మారిపోయింది. ఎన్నికలను రసవత్తరంగా మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించారు. ‘మా’ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక ఆలోచనలతో ‘మా’ ప్రతిష్ఠను నిలబెడతానన్నారు. నటీనటుల బాగు కోసం పనిచేస్తానని చెప్పారు.

ప్రకాశ్ రాజ్ టీమ్ ఇదే...

ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీశ్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు.
MAA
Prakash Raj
Tollywood

More Telugu News