జులై 31 లోగా ఇంటర్ ఫలితాలను వెల్లడించండి: సుప్రీం కోర్టు
- రాష్ట్రాల బోర్డులకు ఆదేశం
- అసెస్మెంట్ కోసం 10 రోజుల గడువు
- ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పరీక్షల రద్దు
గత వారమే రెండు బోర్డులు కూడా మార్కులు వేసే విధానాన్ని కోర్టుకు సమర్పించాయి. ఆ అఫిడవిట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. వ్యతిరేకించేందుకు ఆ విధానాల్లో లోపాలేవీ లేవని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించాలన్న కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఇప్పటిదాకా 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించారు.