బాలయ్య సరసన సందడి చేయనున్న మెహ్రీన్?
- మెహ్రీన్ చేతిలో 'ఎఫ్ 3' మాత్రమే
- బాలకృష్ణ సినిమా కోసం సంప్రదింపులు
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్
మెహ్రీన్ కి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది .. అందువలన ఆమె కొంత కాలంగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. సీక్వెల్ కనుక 'ఎఫ్ 3' సినిమా చేయడానికి అంగీకరించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. అయితే కరోనా కారణంగా మెహ్రీన్ వివాహం వాయిదా పడింది. మళ్లీ ముహూర్తం నిర్ణయించేవరకూ .. వచ్చిన సినిమాలు చేయాలని ఆమె నిర్ణయించుకుందట. అందువలన బాలకృష్ణ సినిమాను ఆమె అంగీకరించే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అధికారిక ప్రకటన వస్తేనేగానీ నమ్మలేం. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాకుండా, ఆయన డాన్సులు .. ఫైట్లు కొత్తగా ఉండేలా గోపీచంద్ మలినేని ప్లాన్ చేశాడని అంటున్నారు.