జగన్ కేసులపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

AP HC adjourns hearing of Jagan cases
  • ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై పలు కేసుల నమోదు
  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల ఉపసంహరణ
  • సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన హైకోర్టు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర అభియోగాలతో దాదాపు 11 కేసులను నమోదు చేశారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఈ వ్యవహారంపై ఊహించని విధంగా ఏపీ హైకోర్టు స్పందించింది. కేసుల ఉపసంహరణను సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది. దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను వినిపించారు.

న్యాయపరమైన చర్యలను పరిపాలన విధానాల ద్వారా తీసుకోవడం న్యాయ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ కేసులకు సంబంధించి కోర్టుకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని... ఈ కేసుకు విచారణార్హత ఉందో, లేదో నిర్ధారించాలని కోరారు. ఏజీ వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
Go Back to Shorts
AP High Court
Jagan
Cases

More Telugu News