మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట
- ఆమె ఎస్సీ కాదంటూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన నవనీత్ కౌర్
- నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు
- బాంబే హైకోర్టు తీర్పుపై స్టే
నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం. అయితే, నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, ఆమె ఎస్సీ కాదని శివసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ విచారణ జరిపి, నవనీత్ కౌర్ మోసపూరితమైన రీతిలో కల్పిత పత్రాలను సమర్పించినట్టు అభిప్రాయపడింది. ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. ఆమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది.