వచ్చే వారం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు: ఎమిరేట్స్
- ఏప్రిల్ 25 నుంచి విమాన సర్వీసుల బంద్
- వచ్చే వారం నుంచి సర్వీసులు తిరిగి అందుబాటులోకి
- యూఏఈ ధ్రువీకరించిన రెండు డోసులు తీసుకుంటునే అనుమతి
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నైజీరియా, భారతదేశ ప్రయాణికుల కోసం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తాజాగా ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. భారత ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతోపాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు కరోనా టీకా డోసులను తీసుకున్న వారికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొంది. ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగటివ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది.