ధనుశ్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా ఖరారు!
- ధనుశ్ నుంచి త్రిభాషా చిత్రం
- దర్శకుడిగా శేఖర్ కమ్ముల
- నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన
- త్వరలో మిగతా వివరాలు
కానీ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ధనుశ్ హీరోగా ఈ సినిమా రూపొందడం నిజమేననే విషయం అధికారికంగా స్పష్టమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ హీరోగా తాము ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్ .. పుష్కర్ రామ్మోహన్ రావు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లవ్ స్టోరీ' విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.