సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సాయిపల్లవికి బాలీవుడ్ ఆఫర్!
- ధనుష్ తో శేఖర్ కమ్ముల ప్రాజక్ట్
- యూ ట్యూబ్ లో 'మజిలీ' దూకుడు
* ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' చిత్రం త్వరలో విడుదల కానుంది. మరోపక్క, దర్శకుడు శేఖర్ తన తదుపరి చిత్రాన్ని తమిళ నటుడు ధనుష్ హీరోగా రూపొందించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిని త్రిభాషా చిత్రంగా నిర్మిస్తారట.
* నాగ చైతన్య, సమంత కలసి రెండేళ్ల క్రితం నటించిన 'మజిలీ' చిత్రం ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డు కొట్టింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పెట్టగా, ఇప్పటికి 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే, ఓ మిలియన్ పైగా లైక్స్ కూడా పొందింది.