డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. యూకేలో లాక్‌డౌన్ ఎత్తివేత నాలుగు వారాల ఆలస్యం!
- బి.1.617.2 రకమే డెల్టా వేరియంట్
- ఇంగ్లండ్‌లో వారంలో 30 వేలు పెరిగిన కేసులు
- లాక్‌డౌన్ ఎత్తివేత ఆలోచనను విరమించుకున్న జాన్సన్ ప్రభుత్వం
కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తుండడంతో లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఎత్తివేత ఆలోచనను విరమించుకున్న ప్రభుత్వం.. మరో నాలుగు వారాలపాటు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మరోవైపు, యూకేలో కరోనా కేసులు కూడా పెద్ద ఎత్తున వెలుచూస్తున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 8,125 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, భారత్‌లో వెలుగుచూసిన బి.1.617.2 వేరియంట్‌నే డెల్టా వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా వ్యాపిస్తున్నట్టు పలు పరిశోధనలు వెల్లడించాయి.