శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.. సీజేఐగా తొలిసారి నేడు హైదరాబాదుకు!
- మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం
- తిరుచానూరు పద్మావతి అమ్మవారినీ దర్శించుకోనున్న జస్టిస్ రమణ
- మధ్యాహ్నం హైదరాబాద్‌కు పయనం
ఈ రోజు మధ్యాహ్నం జస్టిస్ రమణ హైదరాబాద్‌కు రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జస్టిస్ రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలకనున్నారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో జస్టిస్ రమణ బస చేస్తారు. ప్రజల నుంచి విజ్ఞప్తులూ స్వీకరించే అవకాశం ఉంది.

