Pavan kalyan: పవన్ కి కథ రెడీ చేసే పనిలో శ్రీకాంత్ అడ్డాల?

Srikanth Addala another movie with Pavan kalyan
షార్ట్స్‌లో చూడండి
శ్రీకాంత్ అడ్డాల కొంత గ్యాప్ తరువాత 'నారప్ప' సినిమా చేశాడు. వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా, తమిళంలో విజయవంతమైన 'అసురన్' కి రీమేక్. కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో తనకి హిట్ పడుతుందనే బలమైన నమ్మకంతో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ 'కర్ణన్' రీమేక్  హక్కులను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను ఆయన శ్రీకాంత్ అడ్డాలకే అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే 'దిల్' రాజు నుంచి శ్రీకాంత్ అడ్డాలకి కాల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. పవన్ తో 'వకీల్ సాబ్' హిట్ కొట్టిన దిల్ రాజు, ఆ తరువాత సినిమాకి కూడా ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయనకి కాల్ చేశాడట. మంచి కథను రెడీ చేసుకుని పవన్ కి వినిపించమని చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఆ పనిలోనే ఉన్నాడట. గతంలో దిల్ రాజు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో 'కొత్త బంగారులోకం .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వచ్చిన సంగతి తెలిసిందే. చూస్తుంటే శ్రీకాంత్ అడ్డాల మళ్లీ బిజీ అయ్యేలానే కనిపిస్తున్నాడు.
Go Back to Shorts
Pavan kalyan
Dil Raju
Srikanth Addala

More Telugu News