ఆహాలో 'అర్ధశతాబ్దం' .. ట్రైలర్ రిలీజ్
- మరో ప్రేమకథగా 'అర్ధ శతాబ్దం'
- ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్
- ఈ నెల 11వ తేదీన విడుదల
ఇది ఓ పల్లెటూరిలోని ప్రేమకథ .. ప్రేమకు కులం ఎప్పుడూ అడ్డుగోడగా నిలుస్తూనే ఉంటుంది. ఈ కథలోను అదే ప్రధానమైన అంశం అని తెలుస్తోంది. ప్రేమికులను విడదీయడానికి రెండు కులాలవారు .. రెండు వర్గాలుగా విడిపోయి చేసే పోరాటంగా ఈ కథ కనిపిస్తోంది. మధ్యలో నక్సలిజం పాయింటును కూడా టచ్ చేశారు.
"మన పక్కన ఉండేవాడు మన కులం కాకపోయినా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ మన బిడ్డ పక్కలో ఉండేవాడు మనవాడే అయ్యుండాలి" అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సాయికుమార్ .. ఆమని ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు.