స్టార్ హీరోతో 'జాంబిరెడ్డి' దర్శకుడి సినిమా!

Prashanth Varma new project update
  • విభిన్నమైన కథా చిత్రాలు
  • కొత్తదనానికి ప్రాధాన్యత
  • 'జాంబి రెడ్డి'తో హిట్
  • మరో ప్రాజెక్టుకు శ్రీకారం
మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. 'అ' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ, ఆ తరువాత భారీ సినిమాలను కూడా హ్యాండిల్ చేయగలనని 'కల్కి' సినిమాతో నిరూపించాడు. ఇక 'జాంబి రెడ్డి' సినిమాతో కొత్త జోనర్ ను కూడా టచ్ చేశాడు. ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడంతో, సీక్వెల్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మొదలు పెట్టేశాడని కూడా చెప్పుకుంటున్నారు.

ఇక ఒక స్టార్ హీరో తో మరో ప్రాజెక్టును సెట్ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ స్టార్ హీరోకి కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. రేపు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నాడని చెబుతున్నారు. స్టార్ హీరో ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రేపు రిలీజ్ కానున్న పోస్టర్ చాలా వివరాలు అందించవచ్చని అనుకుంటున్నారు.

Go Back to Shorts
Prashanth Varma
Kalki
Zombie Reddy

More Telugu News