ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం!
- ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేయించుకోలేదన్న ప్రభుత్వం
- మందును లోకాయుక్త ఎలా ఆపుతుందన్న ఆనందయ్య న్యాయవాది
- తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదిస్తూ... ఆయన మందును ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన మందును ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఇరువైపుల వాదనలను విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.