కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ ఈ నెల 19కి వాయిదా
- కరోనా పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్లు
- కోర్టును ఆశ్రయించిన న్యాయవాదుల సంఘం, ఏపీసీఎల్ఏ, తోట సురేశ్
- విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
- అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశం
సీనియర్ సిటిజన్లు, కొవిడ్ రోగులకు ఇళ్ల వద్దే వ్యాక్సిన్ ఇస్తామన్న కార్యాచరణ ఏమైందని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయో ఈ నెల 19న తెలపాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో బెడ్లు, కరోనా చికిత్స వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల రోజువారీ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించాలని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.