కడప జిల్లాలో పేలుడు.. 9 మంది మృతి.. తునాతునకలైన మృతదేహాలు
- కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ఘటన
- జిలెటిన్‌స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు
- బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి తరలిస్తుండగా ఘటన
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. ప్రమాదవశాత్తు వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.