ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసిన చైతూ, రాశి ఖన్నా
- విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా 'థ్యాంక్యూ'
- బీవీఎస్ రవి అందించిన కథ, మాటలు
- తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
ఇక్కడికి వచ్చిన తరువాత కరోనా ఉద్ధృతి తగ్గేంత వరకూ విశ్రాంతి తీసుకుని, ఆ తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. బీవీఎస్ రవి కథ - మాటలు అందించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం చైతూ నటించిన 'లవ్ స్టోరీ' రిలీజ్ కి రెడీగా ఉండగా, రాశి ఖన్నా చేతిలో 'పక్కా కమర్షియల్' సినిమా ఉంది.