సంగం డెయిరీని ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను నిలిపేసిన హైకోర్టు!
- జీవోను రద్దు చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్టర్ల పిటిషన్
- నేడు విచారణ జరిపిన హైకోర్టు
- డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వ్యాఖ్య
- డెయిరీ ఆస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే
అనంతరం, సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్టర్లు వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. సంగం డెయిరీని ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, ఆ డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని తెలిపింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.