'అంటే .. సుందరానికీ!' నజ్రియా హ్యాండ్ ఇచ్చేసిందా?
- రీసెంట్ గా హైద్రాబాద్ వచ్చిన నజ్రియా
- పెరుగుతున్న కరోనా కేసులు చూసి టెన్షన్
- ఆమె కాంబినేషన్లోని సీన్స్ వాయిదా
'అంటే .. సుందరానికీ' సినిమాలో నజ్రియా నాయికగా చేస్తుంటే, ఆమె భర్త ఫహద్ ఫాజిల్, 'పుష్ప' సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఆయా సినిమా టీమ్ లు వాళ్లకు వెల్కమ్ చెప్పాయి. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత ఇక్కడి కరోనా కేసుల తీవ్రత చూసిన నజ్రియా, ఇలాంటి పరిస్థితుల్లో తాను షూటింగ్ చేయలేనని చెప్పేసి వెళ్లిపోయిందని అంటున్నారు. దాంతో ఆమె కాంబినేషన్లోని సీన్స్ ను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నదియా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.