26న భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
- మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధకాండ
- ఉద్యమాన్ని నిర్మూలించే ప్రయత్నం
- లేఖలో ఆరోపించిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కైలాసం
ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో నిర్బంధకాండ కొనసాగుతోందని కైలాసం ఆ లేఖలో ఆరోపించారు.