ఏపీలో కరోనా నియంత్రణకు మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
- ఏపీలోనూ కరోనా బీభత్సం
- నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు
- ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
- కన్వీనర్ గా వ్యవహరించనున్న ఆళ్ల నాని
- ఈ నెల 22న కమిటీ సమావేశం
ఏపీలో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కరోనా రోగులకు అందుతున్న చికిత్స, ఇతర సేవలు, కమాండ్ కంట్రోల్ తదితర అంశాలను ఈ ఐదుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షించనుంది. ఈ క్రమంలో ఈ నెల 22న మంగళగిరి ఏపీఐసీసీ భవనంలో కమిటీ సమావేశం కానుంది. ఏపీలో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో, వ్యాప్తిని మరింత సమర్థంగా అరికట్టడం పైనా, వ్యాక్సినేషన్ పైనా ఈ సమావేశంలో చర్చిస్తారు.