దంతేవాడలో ఎదురుకాల్పులు.. రూ.5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు హతం
- మావోయిస్టు మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తింపు
- 9 ఎంఎం తుపాకీతో పాటు మూడు కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం
- ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు
ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకుని పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భద్రతా బలగాలు దంతేవాడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి.