బాబాయ్ తరువాత అబ్బాయ్ తోనే బోయపాటి సినిమా?
- కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్
- 'రా' ఏజెంట్ గా కొత్త లుక్
- బోయపాటికి గ్రీన్ సిగ్నల్
ఈ సినిమా తరువాత బోయపాటితో సెట్స్ పైకి వెళ్లే హీరో కల్యాణ్ రామ్ అని తెలుస్తోంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ బోయపాటి కథను వినిపించడం .. కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ కథలో ఆయన 'రా' ఎంజెంట్ గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే బోయపాటితో కల్యాణ్ రామ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.