జానారెడ్డిని మరింత ముంచడానికే కాంగ్రెస్ నేతలు వచ్చారు: తలసాని
- నాగార్జునసాగర్ లో తలసాని ప్రచారం
- నోముల భగత్ విజయం ఖాయమని ధీమా
- జానారెడ్డి ఇప్పటికే మునిగిపోయి ఉన్నాడని విమర్శలు
- ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగార్జునసాగర్ లో నోముల భగత్ తిరుగులేని మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. నోముల భగత్ రాజకీయాల్లో జూనియర్ అంటూ ప్రచారం చేస్తున్నారని.... అభివృద్ధి చేయడానికి ఎవరైతే ఏంటి? అని ప్రశ్నించారు. జానారెడ్డి ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే జానారెడ్డి మునిగిపోయి ఉంటే, ఆయనను మరింతగా ముంచడానికి కాంగ్రెస్ నేతలు వచ్చారని ఎద్దేవా చేశారు.
గత మూడున్నర దశాబ్దాలుగా జానారెడ్డి ఇక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇప్పుడా ప్రజలను చైతన్యం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు వచ్చారని తలసాని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ లో ఈ నెల 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.