తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై జేడీయూ ఫిర్యాదు.. తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
- రత్నప్రభపై ఐదు కేసులు పెండింగులో ఉన్నాయి
- కుల ధ్రువీకరణ పత్రాలను కూడా ఆమె సమర్పించలేదు
- ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలి
రత్నప్రభపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను చక్రధర్‌బాబుకు అందించారు. అలాగే, రత్నప్రభ తన నామినేషన్ పత్రంతో కులధ్రువీకరణ పత్రాలను సమర్పించలేదని, కాబట్టి ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని రమణ డిమాండ్ చేశారు.
అయితే, రత్నప్రభపై చేసిన ఆరోపణలను జేడీయూ నేత రమణ నిరూపించలేకపోయారని, దీంతో ఆమె నామినేషన్‌ను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు తెలిపారు.