చంద్రబాబు ఆ పని చేసుంటే టీఆర్ఎస్ ఉండేదే కాదు: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు!
- కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు
- ఇచ్చుంటే ఏపీ విడిపోయేది కాదు
- చంద్రబాబును నిమ్మగడ్డ కూడా కాపాడలేకపోయారన్న నాని
తాజాగా, వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని, ఏపీలో ఎకరం భూమి విలువ రూ. 10 లక్షలకు పడిపోయిందని, అందుకు కూడా చంద్రబాబు గత విధానాలే కారణమని, ఆయన పార్టీని ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా కాపాడలేకపోయారని సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ. 3.60 లక్షల కోట్ల అప్పులను తీసుకుని రాలేదా? అని ప్రశ్నించిన ఆయన, త్వరలో తిరుపతిలో జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించనుందని జోస్యం చెప్పారు.