ప్రియాంక చోప్రా కొత్త వ్యాపారం... అమెరికాలో రెస్టారెంట్ ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియాంక చోప్రా కొత్త వ్యాపారం... అమెరికాలో రెస్టారెంట్ ప్రారంభం

Priyanka Chopra starts restaurant in New York
  • న్యూయార్క్ లో సోనా పేరిట రెస్టారెంట్
  • భారతీయ వంటకాలకు ప్రత్యేకం
  • ప్రస్తుతం లండన్ లో ఉన్న ప్రియాంక
  • ఓపెనింగ్ కు హాజరు కాలేకపోయిన వైనం
సినీ తారలు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా తాజాగా రెస్టారెంట్ రంగంలో ప్రవేశించింది. న్యూయార్క్ లో 'సోనా' పేరుతో రెస్టారెంట్ ప్రారంభించింది. ఆ రెస్టారెంట్ కు నామకరణం చేసింది తన భర్త నిక్ జోనాస్ అని ప్రియాంక వెల్లడించింది.

ఈ రెస్టారెంట్ లో నోరూరించే భారతీయ వంటకాలను వండి వడ్డించనున్నారు. అయితే లండన్ లో ఉండడంతో ప్రియాంక తన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయిందట. అందుకు ఎంతో బాధగా ఉందని పేర్కొంది. తన రెస్టారెంట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
Priyanka Chopra
Restaurant
New York
Sona
Nick Jonas

More Telugu News