విపరీతంగా కురుస్తున్న మంచు.. 'కార్తికేయ-2' షూటింగ్ నిలుపుదల!
- నిఖిల్ హీరోగా కార్తికేయ 2
- హిమాచల్ లో సినిమా చిత్రీకరణ
- త్వరలోనే యాక్షన్ సీన్స్ తీస్తామన్న యూనిట్
ఈ విషయాన్ని వెల్లడించిన నిఖిల్, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేస్తున్నామని అన్నాడు. ఇదే లొకేషన్ లో పరిస్థితులు అనుకూలించిన తరువాత ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నామని తెలిపాడు. కాగా, ఈ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.