ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్... కేంద్రం కీలక నిర్ణయం
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి
- వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రణాళికలు
- అర్హులైన వారు వ్యాక్సిన్లు తీసుకోవాలన్న ప్రకాశ్ జవదేకర్
- అపోహలు వద్దని సూచన
- వ్యాక్సిన్లకు దేశంలో కొరత లేదని వెల్లడి
మరోపక్క, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో 80 లక్షల మంది వ్యాక్సిన్ పొందారని వివరించారు. గత 24 గంటల్లో 32.54 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు జవదేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో సగటున రోజుకు 3.77 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.