ధోనీ రికార్డును అధిగమించిన ఆఫ్ఘనిస్థాన్ సారథి
- కెప్టెన్ గా అంతర్జాతీయ టీ20ల్లో ధోనీకి 41 విజయాలు
- ఇప్పుడా రికార్డును తిరగరాసిన అస్ఘర్ ఆఫ్ఘన్
- 42 విజయాలతో కొత్త రికార్డు
- జింబాబ్వేతో రెండో టీ20లో విజయంతో విశిష్ట ఘనత
ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తూ, క్రమంగా బలమైన జట్టుగా ఎదుగుతోంది. రషీద్ ఖాన్, ముజీబ్, నబి వంటి క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్ పోటీల్లో రాణిస్తూ ఆఫ్ఘన్ క్రికెట్ సత్తా చాటుతున్నారు.