పెరుగుతున్న కరోనా వ్యాప్తి... రజనీకాంత్ సినిమా మరింత ఆలస్యం!

16-03-2021 Tue 18:00 | Entertainment
  • అన్నాత్తే చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • ఇటీవల హైదరాబాదులో చిత్రీకరణ
  • రజనీకి అనారోగ్యం.. నిలిచిన షూటింగ్
  • దేశంలో మరోసారి కొత్త కేసుల తీవ్రత
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా ఇటీవలే హైదరాబాదులో చిత్రీకరణ జరుపుకుంది. అయితే రజనీకాంత్ అనారోగ్యం పాలై హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరడంతో షూటింగ్ నిలిచిపోయింది. అటు ఆయన రాజకీయ పార్టీ ఆలోచనకు కూడా శాశ్వతంగా స్వస్తి పలికారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య రీత్యా రాజకీయాలు సరిపడవని వైద్యులు సూచించిన మేర ఇక ఆయన సినిమాలకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు.

అన్నాత్తే షూటింగ్ లో పాల్గొంటానని కొన్నిరోజుల కిందటే రజనీ ఉత్సాహంగా ప్రకటించారు. కానీ దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో రజనీ బయటికి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. వీలైనంతవరకు ఇంట్లోంచి బయటికి రావొద్దని కేంద్రం 60 ఏళ్లకు పైబడినవారికి కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పైగా మహారాష్ట్రలో కొత్త కేసుల ఉద్ధృతి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ సెట్స్ పైకి రావడం ఎంతో రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని చిత్రయూనిట్ ఆందోళన చెందుతోంది. దాంతో ఆ సినిమా చిత్రీకరణ మరికొంత ఆలస్యం కానుంది.

వాస్తవానికి అన్నాత్తే చిత్రాన్ని ఈ వేసవిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ, షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఇప్పటివరకు టాకీ పార్ట్ పూర్తికాలేదు. దాంతో రిలీజ్ ను దీపావళికి వాయిదా వేశారు. దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది.
RajinikanthAnnatheShootingCorona Virus

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more