రణగొణ ధ్వని చేస్తున్న బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన ఏపీ పోలీసులు
- విపరీతమైన ధ్వని పుట్టించే బుల్లెట్ సైలెన్సర్లు
- స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జంగారెడ్డిగూడెం పోలీసులు
- పెద్ద సంఖ్యలో సైలెన్సర్ల స్వాధీనం
- శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లపై ఉక్కుపాదం
గత రెండు వారాలుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో బుల్లెట్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ తరహా సైలెన్సర్లను బుల్లెట్ మోటార్ సైకిళ్లకే కాకుండా, కొన్ని రకాల స్పోర్ట్స్ బైకులకు కూడా వినియోగిస్తుంటారు. వీటిపైనా జంగారెడ్డిగూడెం పోలీసులు ఉక్కుపాదం మోపారు.