ఆర్థిక మాంద్యం నుంచి బయటపడ్డ ఇండియా... కరోనా తరువాత తొలి సారి వృద్ధి గణాంకాలు!
- లాక్ డౌన్ కారణంగా గత సంవత్సరం కుదేలైన వృద్ధి
- డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో పాజిటివ్ సంకేతాలు
- ఈ సంవత్సరం 10 శాతానికి పైగా జీడీపీ పెరుగుదల అంచనా
కాగా, జూన్ త్రైమాసికంలో 23.9 శాతం పతనమైన జీడీపీ, ఆపై సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5 శాతం దిగజారిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సాంకేతిక మాంద్యంగానే పరిగణించాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అన్ లాక్ ప్రక్రియ మొదలు కాగానే స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల ప్రారంభమైందని గుర్తు చేశారు.
ఇదిలావుండగా, గడచిన జనవరి మాసంలో మౌలిక రంగ వృద్ధి 0.1 శాతంగా నమోదు కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఈ నెల తొలి వారంలో జరిగిన ఆర్బీఐ పరపతి సమీక్ష అభిప్రాయపడగా, 11.5 శాతం వరకూ భారత జీడీపీ పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసిన సంగతి తెలిసిందే.