వేదికపై కుప్పకూలిన గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్
- సభలో మాట్లాడుతూ వేదికపై పడిపోయిన విజయ్ రూపానీ
- వెంటనే అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు
- వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ
- సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు
ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం రూపానీ కరోనా బారినపడినట్టు ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఈసీజీ, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని, ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని యూఎన్ మెహతా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ వెల్లడించారు.