వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిన గుజరాత్ సీఎం విజయ్ రూపాని... వీడియో ఇదిగో!
- నిజామ్ పురాలో జరిగిన సభ
- ప్రసంగిస్తూ పడిపోయిన రూపానీ
- అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు
ఆయన గత రెండు రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్నారని, అయినప్పటికీ ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని వ్యాఖ్యానించిన బీజేపీ నేత దంగేర్, బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ తప్పారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యాధికారులు పేర్కొన్నారని తెలిపారు.