ఆఖరి నిమిషంలో.. ఉప మేయ‌ర్ అభ్య‌ర్థిని మార్చిన బీజేపీ

we dont participate in ghmc mayor election
  • మేయ‌ర్ ఎన్నిక‌లో పాల్గొనం: కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు 
  • మొద‌ట  ర‌విచారిని ప్ర‌క‌టించిన కాషాయ పార్టీ
  • ఆయ‌న ఆల‌స్యంగా రావ‌డంతో  శంక‌ర్ యాద‌వ్ ఖరారు
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్  కార్పొరేట‌ర్లుగా ఎన్నికైన వారు ఈ రోజు ప్ర‌త్యేక స‌మావేశంలో ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అనంతరం నిమిషాల వ్య‌వ‌ధిలోనే ప‌లు కీలక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కాసేప‌ట్లో కార్పొరేట‌ర్లు మేయ‌ర్, ఉప మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ల్లో పాల్గొనడం లేద‌ని ఇద్ద‌రు కాంగ్రెస్ అభ్య‌ర్థులు చెప్పారు.

బీజేపీలోనూ మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఉప మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఆ పార్టీ మొద‌ట ర‌విచారిని ప్ర‌క‌టించింది. అయితే, ఈ రోజు జీహెచ్ంఎసీ స‌మావేశానికి ఆయ‌న ఆల‌స్యంగా రావ‌డంతో బేగంబ‌జార్ కార్పొరేట‌ర్ శంక‌ర్ యాద‌వ్ పేరును బీజేపీ ప్ర‌క‌టించింది. కాసేప‌ట్లో జీహెచ్ఎంసీ మేయ‌ర్, ఉప మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది.
Go Back to Shorts
GHMC
GHMC Elections
Congress
BJP

More Telugu News