పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన చిట్యాల సీఐ

11-02-2021 Thu 07:15 | Telangana
  • హన్మకొండ కేయూసీ సమీపంలో కారులోనే పురుగుల మందు తాగిన సీఐ
  • గమనించి ఆసుపత్రిలో చేర్పించిన బ్లూకోల్ట్ పోలీసులు
  • ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలే కారణమంటూ సూసైడ్ లేఖ
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాయి రమణ వరంగల్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో కేయూసీ ఫిల్టర్ బెడ్ సమీపంలో తన కారులోనే ఆయన పురుగుల మందు తాగారు. ఆ తర్వాత కాసేపటికే అదే దారి గుండా వెళ్తున్న బ్లూకోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది అపస్మారకస్థితిలో కారులో పడి వున్న ఆయనను గమనించారు. అయితే, ఆయన సీఐ అని వారికి తెలియదు. 

అదే సమయంలో సీఐకి ఫోన్ రావడంతో పోలీసులు మాట్లాడడంతో ఆయన చిట్యాల సీఐ అని తెలిసింది. దీంతో వెంటనే ఆయనను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సీఐ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రమణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెంటనే హన్మకొండ వచ్చి చికిత్స పొందుతున్న సీఐని పరామర్శించారు.
Jayashankar Bhupalpally DistrictChityal CISuicide

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more