షర్మిలపై పోస్టులు పెట్టొద్దు: పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ కీలక ఆదేశాలు
- తెలంగాణలో కొత్త పార్టీని పెడుతున్న షర్మిల
- రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే లక్ష్యమని వ్యాఖ్య
- షర్మిలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న టీఆర్ఎస్ శ్రేణులు
షర్మిల ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసిన ఫ్లెక్సీలను కూడా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. షర్మిలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను, ఫొటోలను తొలగిస్తున్నారు. మరోవైపు షర్మిల పార్టీపై బీజేపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని వారు అంటున్నారు.