Galla Jayadev: బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు: గల్లా జయదేవ్

Galla Jaydev opines on Union Budget
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రకటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో మంచి ప్రొవిజన్స్ ఉన్నాయని, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడామని అన్నారు. వైసీపీ నుంచి 21 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. బడ్జెట్ లో రాష్ట్రం గురించి ఒక్క ప్రతిపాదన కూడా లేదని అన్నారు. బడ్జెట్ లో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అంశాల ప్రస్తావనే లేదని తెలిపారు.
Go Back to Shorts
Galla Jayadev
Union Budget 2021-22
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News